Salaar : వైరల్ అవుతున్న సలార్ డైలాగ్ ప్రోమో.. పార్ట్ 2 పై ఆసక్తి పెంచేసిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్..కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తరువాత వరుస సినిమాలు చేసారు. కానీ అవేమి బాహుబలి వంటి భారీ హిట్ అందించలేకపోయాయి.ఇక ఇదే సమయంలో కేజిఎఫ్ సినిమాతో విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ రేంజ్ కటౌట్ కి.. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కి ప్రేక్షకులకు పూనకాలు రావాల్సిందే.. సలార్ సినిమా విడుదలకు ముందు అందరికీ ఇదే అనిపించింది. అన్నట్టుగానే సలార్ పార్ట్-1 సీజ్‌ఫైర్ విడుదల తర్వాత బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ సినిమా చివరలోనే సలార్-2 గురించి అనౌన్స్ చేయడంతో శౌర్యాంగ పర్వంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో హోంబలే ఫిలింస్ ఆసక్తికరమైన అప్‌డేట్ ను ఇచ్చింది.
సలార్-2 కి సంబంధించిన డైలాగ్ ప్రోమోను రిలీజ్ చేసింది.. శౌర్యాంగపర్వంలో ఎలాంటి అంశాలు ఉండొచ్చనే విషయాలపై హింట్ ఇస్తూ ఒక వీడియోను కాసేపటి క్రితం విడుదల చేసింది. అందులో ‘ ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సర్ యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఇంకో పక్క వేలమంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ దేవా.. అదే కుర్చీని వరదా కు ఇస్తానని మాటిచ్చాడు. కానీ.. దాని మీద కూర్చునే హక్కు దేవాది.’ అంటూ సాగిన డైలాగ్ ప్రోమో అదిరిపోయింది. ఖాన్సర్ కుర్చీ మీద దేవా కూర్చుంటాడా.. లేక ఇచ్చిన మాట కోసం వరదా వెనుక నిలబడతాడా..అనే సందేహంతో పార్ట్2 పై ఈ ప్రోమో మరింత ఆసక్తిని పెంచేసింది. 34 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్‌గా మారింది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!