Salaar: ‘సలార్’ టీజర్లో ఇంట్రెడక్షన్ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ వరల్డ్ స్టార్ హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకేక్కిస్తుండటంతో దీనిపై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ డార్లింగ్ ఫ్యాన్స్ తో సినీ అభిమానులను తెగ ఆకట్టుకుంది..
ఈ టీజర్ ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు విడుదల అయ్యింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.. వ్యూస్ తో దూసుకుపోతుంది.. ప్రభాస్ మాస్ లుక్ లో అదరగోట్టారు.. కే.జీ.ఎఫ్ మించిన యాక్షన్ ఇందులో ఉన్నట్లు టీజర్ లో చూపించారు.. టీజర్ లో డార్లింగ్ దుమ్ము దూళిపాడు.. ఇక టీజర్ లో.. KGF ని మించి మాస్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు చూపించారు.. ఆ సినిమాలో యష్ కు ఇంట్రడక్షన్ ఇచ్చినట్లే ఈ టీజర్ లో కూడా ప్రభాస్ కు ఒకరు ఇంట్రడక్షన్ ఇచ్చారు.. అతను ఎవరు అని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు..
Also Read
అతను మరెవ్వరో కాదు..టీనూ ఆనంద్.. గతంలో తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఆదిత్య 369 చిత్రంతో పాటు, మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి లో భాటియా పాత్రలో కనిపించారు టీనూ ఆనంద్.. ఈయన ఫ్యామిలి మొత్తం సినీ ఇండస్ట్రీకి చెందిన వారే.. ఆయన మేనల్లుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పఠాన్, వార్, బ్యాంగ్ బ్యాంగ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక టీనూ ఆనంద్ తెలుగులో ఆదిత్య 369 తొలి కాగా.. పుష్పక విమానం, అంజి, ఘటోత్కచుడు, సాహో, సీతారామమ్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు సలార్ చిత్రంలో కనిపించనున్నారు. టీనూ ఆనంద్ కేవలం నటుడు మాత్రమే కాదు.. రచయిత, దర్శకుడు కూడాను.. ఇక ఈ సినిమా అతనికి హిట్ ఇస్తుందని ఫ్యాన్స్అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!