Site icon NTV Telugu

గుడ్ న్యూస్ : అదనపు వసూళ్లపై వెనక్కి తగ్గిన ఆర్టీసీ !

TSRTC

తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై టి.ఎస్.ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు. గడిచిన 5 రోజుల్లనే 1.3కోట్ల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చిందని… దీనిపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జనార్‌. టి.ఎస్.ఆర్టీసీని ప్రయాణీకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని… ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్న ప్రయాణిక దేవుళ్ళందరికి వందనాలు అని చెప్పారు. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికుల సౌకర్యం భధ్రతే ధ్యేయంగా ఈ పండుగ సమయంలో తాము ఆర్టీసీ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తాయని తాము ఆకాంక్షిస్తున్నామని వెల్లడించారు.

Exit mobile version