NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: సంక్షేమమే అభివృద్ధి అని జగన్ నిరూపించారు

Sajjala

Sajjala

జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలతోనే మా పార్టీ మ్యానిఫెస్టో రూపొందింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాలుగున్నర ఏళ్ళల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో అందరి.. కోటి 40 లక్షల కుటుంబాలకు నేరుగా ప్రయోజనం పొందారు.. వాళ్ళ జీవితాల్లో ఆ మేరకు మార్పు వచ్చింది అని ఆయన పేర్కొన్నారు.రాజకీయంగా కూడా నిర్ణయాత్మక స్థాయికి ఎదిగారు.. సంక్షేమమే అభివృద్ధి అని జగన్ నిరూపించారు.. రెండేళ్ల కోవిడ్ సంక్షోభాన్ని కూడా దాటుకుని వచ్చాం.. ప్రజలకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఒక భద్రతను, నమ్మకాన్ని జగన్ కల్పించారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Read Also: Varun Tej: అరేయ్ బాబు.. మా పెళ్లి వీడియోను అమ్ముకోలేదు రా అయ్యా.. వరుణ్ టీం క్లారిటీ..

ఏపీలో 2014-2019లో 37,956 ఎమ్ఎస్ఎమ్లు ఉంటే.. 2019-2023లో 2.5 లక్షల ఎమ్ఎస్ఎమ్ లను స్థాపించారు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 16.57 లక్షల మందికి ఉపాధి.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా గత రెండు సంవత్సరాల (2019-20, 2020-21) నుండి 1వ స్థానంలో నిలిచింది.. 2019 GSDP వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 22వ స్థానంలో ఉంది అని ఆయన వెల్లడించారు. ఇవాళ GSDP వృద్ధి రేటులో 1వ స్థానంలో ఉన్నాం.. 2018-19లో ఆంధ్రప్రదేశ్ (-6.5 శాతం) ప్రతికూల వ్యవసాయ వృద్ధి రేటుని నమోదు చేస్తే.. 2021-22లో 8.2 శాతం పెరుగుదలను నమోదు చేసింది అని చెప్పుకొచ్చారు.

Read Also: Balineni Srinivasa Reddy: నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..

దేశ ర్యాంకింగ్స్ లో 27వ స్థానం నుండి ఇప్పుడు 6వ స్థానానికి ఏపీ ఎగబాకింది అని సజ్జల అన్నారు. మేం చేసింది సరిగా లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారు.. 2014-19 మధ్య చంద్రబాబు లూటి చేయటానికి ప్రాధాన్యత ఇచ్చాడు కనుకే ప్రజలు ఇంటికి పంపించారు.. రేపటి నుంచి డిసెంబర్ 19 వరకు ఈ క్యాంపైన్ కొనసాగుతుంది. క్యాంపైన్‌ లో భాగంగా నాలుగు కార్యక్రమాలు ఉంటాయి.. పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రదర్శన ఉంటుంది.. ఆ గ్రామానికి జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రదర్శిస్తారు.. స్థానిక ప్రభావశీలురులతో చర్చాగోష్టి ఉంటుంది.. రాత్రికి ఆ ఊరిలోనే విడిది.. రెండో రోజు మండల స్థాయిలో గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి గడపకు వెళతారు అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Show comments