NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: రాజధాని అంటే అందరూ ఉండే ప్రాంతం

Sajjala On 3 Capitals

Sajjala On 3 Capitals

అమరావతిలోని R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు జీఓ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన 2 అనుబంధ పిటిషన్లు కొట్టివేసింది ఏపీ హైకోర్ట్. ఈ తీర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది ఒక విజయం అని అనుకోవటం లేదు.. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుంది.. అన్యాయమైన డిమాండ్ ను కోర్టు డిస్మిస్ చేసింది..రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు… రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం.. డిమొగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అనే అన్యాయమైన వాదనను తీసుకుని వచ్చారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read Also: Vidadala Rajini: వైద్య రంగంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదు

లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే భూమి చదును వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం చట్టం ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించాలనే నిబంధనను పట్టించుకోలేదు. మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా తగిన విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో అధికారులు ఇళ్ళ పట్టాల పంపిణీకి అంతా సిద్ధం చేస్తుండడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఇళ్ళ స్థలాల పంపిణీ కోసం ఎంపిక చేసిన మొత్తం లబ్దిదారులు 48379. గుంటూరు జిల్లా పరిధిలో 24152 మంది లబ్దిదారులు.ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 24587 మంది లబ్దిదారులు. రాజధాని పరిధిలో పేదల ఇళ్ల పట్టాల కోసం 1134.58 ఎకరాల కేటాయించింది ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వులతో లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ శరవేగంగా సాగనుంది.

Read Also: Recykal Co-founder: చెత్తకు కొత్త నిర్వచనం ఇచ్చిన విక్రమ్ ప్రభాకర్‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ