NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: బీజేపీ పక్షాన టీడీపీ వాళ్ళను ఎన్నికల బరిలోకి దించారు..

Sajjala

Sajjala

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంత సిద్ధం బస్సు యాత్రకు ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తోంది అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరస్కరించారు.. ఉమ్మడి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చంద్ర బాబు దోచుకున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు సభలు విఫలం అవుతున్నాయి.. జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యంట్రికి ఈసీ అనుమతి తీసుకున్నాము అని ఆయన తెలిపారు. క్యాంపు ఆఫీసుకు ఎదో కంటేయినర్ పై టీడీపీ అసత్య ప్రచారం చేసింది అని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళంలో చట్టబద్ధంగా తీసుకున్న గోడౌన్ పై కూడా తెలుగు దేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది అని సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Top Headlines@1PM: టాప్‌ న్యూస్

ఇక, టీడీపీది దివాలకోరుతనం అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమి చేస్తామో టీడీపీ చెప్పాలి కానీ.. తప్పుడు ప్రచారం చేయడమే నమ్ముకుంది ఆ పార్టీ అని విమర్శలు గుప్పించారు. ఇక, టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తే సరిపోయేది అన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో ఆ పార్టీ వాళ్ళు పెద్దగా కనిపించలేదు.. బీజేపీ పక్షాన టీడీపీ వాళ్ళను బరిలో పెట్టారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంకా కొత్త హామీలు ఇస్తారు.. ఆ హామీలకు విలువ లేదు.. చంద్రబాబు అంటేనే నకిలీ.. ఏదీ చెప్పిన అమలు చేయడు.. చంద్రబాబు తప్పుడు దారిలో అధికారంలోకి వస్తే.. ఇప్పుడు వస్తున్న పెన్షన్లు కూడా ఆగిపోతాయి.. అలాగే, చంద్రబాబు హామీలు నకిలీ కరెన్సీతో సమానం అని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Show comments