Site icon NTV Telugu

Sajjala: దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక

Sajjala

Sajjala

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక అని అన్నారు. వివేకా హత్య కేసులో టీడీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని.. సీబీఐ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కూడా చెత్తగా విచారణ చేస్తుంది అనటానికి వివేకా కేసు చరిత్రలో ఉదాహరణగా నిలిచిపోతుందని సజ్జల పేర్కొన్నారు. మెడకాయ పై తలకాయ ఉండే ఎవరైనా.. ఎన్నికల ముందు పార్టీ నేత వివేకా చనిపోతే నష్టపోయేది వైసీపీనే అని అర్థం అవుతుందని అన్నారు. తమ కార్యకర్తలు డీమోరలైజ్ అయితే చంద్రబాబుకు ఉపయోగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం సీబీఐకి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మరోవైపు సీబీఐ మాత్రం టీడీపీ కోణాన్ని బుల్‌డోజ్ చేసుకుంటూ వస్తోందని సజ్జల ఆరోపించారు.

Ramya Krishnan: శివగామి రమ్యకృష్ణ కొడుకును చూశారా.. త్వరలో హీరో అయిపోయేలా ఉన్నాడు

వ్యవస్థల్లో చంద్రబాబు వైరస్ లా పాకిపోయి ఉన్నాడని సజ్జల దుయ్యబట్టారు. ఇంత విచిత్రమైన కేసు ఎక్కడా ఉండదని విమర్శించారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని.. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది అని సజ్జల పేర్కొన్నారు. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసిందని ప్రశ్నించారు. కథలో మలుపులకు తగ్గట్లు సునీత అదనపు సమాచారం పేరుతో ఇస్తూనే ఉన్నారని.. గూగుల్‌ టేక్‌ అవుట్‌ విచారణకు పనికి రాదని సీబీఐకి ఇప్పుడు అర్థమైంది అని సజ్జల పేర్కొన్నారు.

Exit mobile version