SAINDHAV: సెకండ్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్..ఈ సినిమాకు హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు.వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ తో సినిమా పై హైప్ పెంచేస్తుంది.తాజాగా సైంధవ్ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా.. ఇక రెండో సింగిల్ విడుదలకు మేకర్స్ సిద్ధం అయ్యారు.. రేపు విజయవాడ, గుంటూరు పట్టణాల్లో సందడి చేయనుంది సైంధవ్ టీం. మధ్యాహ్నం 2 గంటలకు వివిఐటీ కాలేజీ లో సాయంత్రం 5 గంటలకు కె ఎల్ యూ యూనివర్సిటీ లో విద్యార్థుల మధ్య సాంగ్‌ను లాంఛ్ చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు . వెంకీ తన క్యూట్ ఫ్యామిలీతో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
ఇటీవలే మేకర్స్ లాంఛ్ చేసిన ‘రాంగ్ యూసేజ్’ అనే ఫస్ట్ సింగిల్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సైంధవ్ మూవీ లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు .ఇప్పటికే మేకర్స్ సైంధవ్ పాత్రలకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో షేర్ చేయగా.. నెట్టింట బాగా వైరల్ అవుతుంది.ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా అలాగే నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో మరియు కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించనున్నారు. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
The team of #SAINDHAV will be visiting Vijayawada & Guntur tomorrow ❤️🔥
The second single will have a special launch amidst the energetic students 💥
2PM @ VVIT College
5PM @ KLU University#SaindhavOnJAN13thVictory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl… pic.twitter.com/TfGE5NU189
— Niharika Entertainment (@NiharikaEnt) December 10, 2023
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!