Site icon NTV Telugu

Saindhav : ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న సైంధవ్..స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Whatsapp Image 2024 01 26 At 2.21.06 Pm

Whatsapp Image 2024 01 26 At 2.21.06 Pm

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో 75వ మూవీగా వచ్చింది. ఈ యాక్షన్ పాన్ ఇండియా మూవీను ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించారు.అయితే విడుదలకు ముందు సైంధవ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజులకు వెంకటేష్ సోలో హీరోగా కనిపించడంతో ఆయన అభిమానులు సైంధవ్ మువీపై ఎంతో ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదలైంది.జనవరి 13న తెలగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషషల్లో సైంధవ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ మరియు నాగార్జున నా సామిరంగ చిత్రాలకు పోటీగా వెంకటేష్ సైంధవ్ సంక్రాంతి బరిలోకి దిగింది.కాగా థియేటర్లలో విడుదలైన సైంధవ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.సైంధవ్ సినిమా కాస్తా స్లో నేరేషన్‌తో ఉందని, కొన్ని బ్లాక్స్‌ మరింత ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కిస్తే ఇంకా బాగుండేదని ప్రేక్షకులు తెలియజేశారు..

తాజాగా సైంధవ్ మూవీ ఓటీటీ రైట్స్ మరియు రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుసోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. సైంధవ్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సైంధవ్ మూవీ ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయనేది హాట్ టాపిక్‌గా మారింది. సైంధవ్ మూవీ ఓటీటీ హక్కులను 1.8 మిలియన్ డాలర్ల భారీ వ్యయం చెల్లించి అమెజాన్ దక్కించుకుందని లేటెస్ట్‌గా వినిపిస్తున్న టాక్. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 15 కోట్లకు సైంధవ్ మూవీ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం.. వచ్చే నెల మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 9 న అమెజాన్ ప్రైమ్‌లో సైంధవ్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారట. ఇదే సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు

Exit mobile version