విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సీనియర్ హీరో తాజాగా యాక్షన్ మూవీలపై దృష్టి పెట్టాడు.ఆయన ప్రస్తుతం `సైంధవ్`అనే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. `హిట్` సిరీస్ తో వరుస విజయాలు అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ భారీ యాక్షన్ మూవీ గా రూపొందిస్తున్నాడు.ఫోర్ట్ నేపథ్యం లో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమాతో ఈ సారి వెంకటేష్ తన విశ్వరూపం చూపించబోతున్నట్టు సమాచారం.. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా సినిమాలో భారీ క్లైమాక్స్ పార్ట్ ని పూర్తి చేసినట్టు తెలిపింది చిత్ర యూనిట్. ఎనిమిది మంది ముఖ్యమైన నటులు పాల్గొన్న ఈ షెడ్యూల్ తాజాగా పూర్తయ్యిందని చిత్ర యూనిట్ వెల్లడించారు. దీంతో ఈ సినిమా మెయిన్ పోర్షన్ పూర్తయినట్లు సమాచారం.అయితే అత్యంత ప్రతికూల వాతావరణం లో ఈ భారీ క్లైమాక్స్ ని పూర్తి చేశామని ఈ మేరకు ఓ వీడియోని కూడా వారు విడుదల చేశారు. ఇందులో షూటింగ్ అయిపోయాక టీమ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో వెంకటేష్ టీమ్ అందరికి థ్యాంక్స్ చెబుతూ వెళ్లిపోయారు.ఈ భారీ క్లైమాక్స్ పార్ట్ ని దాదాపు 16 రోజులపాటు పూర్తి చేసినట్టు వారు చెప్పుకొచ్చారు..స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌ల సారథ్యం లో ఈ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.`సైంధవ్`సినిమా భారీ కాస్టింగ్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నెగటివ్ రోల్ చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. రుహానీ శర్మ, ఆండ్రియా, సారా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు..