Saina Nehwal Retirement: భారతదేశపు దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అత్యంత గుర్తింపు పొందిన ప్లేయర్లలో ఒకరైన సైనా నెహ్వాల్ తన రిటైర్మెంట్ ప్రకటించింది. చాలా కాలంగా తీవ్రమైన మోకాలి సమస్యతో బాధపడుతున్నా సైనా.. ఇంకా కోలుకోలేకపోతోంది. చివరికి ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. ఓ పాడ్‌కాస్ట్‌లో సైనా మాట్లాడుతూ.. తన మోకాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీనివల్ల ఉన్నత స్థాయి శిక్షణ అసాధ్యమని సైనా పేర్కొంది.
READ MORE: UP: యూపీలో వింతైన ఘటన.. ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే..!
సైనా ప్రకటనతో భారత బ్యాడ్మింటన్ చరిత్రను మార్చిన ఒక అధ్యాయం ముగిసింది. ఆమె 21 ఏళ్ల కెరీర్‌లో ఒలింపిక్ పతకం, ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోడియం, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్, 10 సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించింది. ఇవన్నీ భారత ఆటగాళ్లకు అరుదైన విజయాలు. చాలా నెలలుగా ఆటకు దూరంగా ఉన్న సైనా రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది. ఆమె చివరిసారిగా సింగపూర్ ఓపెన్ 2023లో పాల్గొంది. ఆ తర్వాత గాయాలు కాగా.. వైద్యులు శస్త్రచికిత్సకి సిఫార్స్ చేశారు. దీంతో సైనా తిరిగి బరిలోకి దిగే అవకాశాలను దాదాపు క్షీణించాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సైనా తన నిర్ణయాన్ని పెద్ద వేదిక, ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించలేదు. ఓ పాడ్‌కాస్ట్‌లో తన రిటైర్మెంట్ గురించి తెలిపింది. తాను మళ్లీ గ్రౌండ్‌లోకి రావడానికి నెలల తరబడి ప్రయత్నించానని చెప్పింది. తీవ్రమైన మోకాలి నొప్పి తనను ఆపేసిందని వెల్లడించింది.
READ MORE: 543 కి.మీ రేంజ్! 7 ఎయిర్‌బ్యాగ్‌లు.. స్టైలీ లుక్.. కంపెనీ తొలి కారు Toyota Ebella EV విడుదల..
అయితే.. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. బ్యాడ్మింటన్‌లో భారతదేశానికి తొలి ఒలింపిక్ పతకం (కాంస్య) తీసుకొచ్చింది. ఈ పతకం భారత బ్యాడ్మింటన్‌లో కొత్త శకానికి నాంది పలికింది. ఈ కాలంలో పివి సింధు, కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ వంటి ఆటగాళ్ళు ప్రపంచ వేదికపై తమ ఉనికిని స్థాపించారు. రియో 2016 ఒలింపిక్స్‌కు ముందు మోకాలి గాయం సైనా కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. కోలుకున్న తర్వాత.. ఆమె 2017, 2018లో కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకం, ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్యం గెలుచుకుని అద్భుతంగా పునరాగమనం చేసింది. కానీ ఆమె మోకాలిగాయం మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆటకు పూర్తిగా స్వస్తి చెప్పింది.
