Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా వారసుడు వరుణ్ తేజ్ ముకుంద, కంచెతో ఫ్రూవ్ చేసుకున్నప్పటికీ పూరీ జగన్నాథ్ లోఫర్, మిస్టర్స్ భారీ డిజాస్టర్స్ వరుణ్ తేజ్ కెరీర్‌పై ఎఫెక్ట్ చూపాయి. ఆ తర్వాత వచ్చిన ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వరుణ్. సోలో హీరోగా అతడి కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా మారింది ఫిదా. ఫిదాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుణ్ తేజ్‌తో పాటు తను కూడా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది సాయి పల్లవి.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
అక్కినేని నట వారసుడు నాగ చైతన్యకు సెకండ్ ఇన్నింగ్స్‌లా మారిన ఫిల్మ్ తండేల్. గత ఏడాది రిలీజైన ఈ ఫిల్మ్ 100 కోట్లు కలెక్ట్ చేసి చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా అవతరించింది. ఈ సినిమాకు ముందుకు హ్యాట్రిక్ డిజాస్టర్స్ టేస్ట్ చేశాడు ఈ అక్కినేని వారసుడు. ఇందులో బుజ్జితల్లిగా సాయి పల్లవికి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ కూడా కమర్షియల్ హిట్. లవ్ టుడే రీమేక్‌గా వచ్చిన లవ్యాపాతో బోల్తా పడ్డ అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్.. మళ్లీ రీమేక్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఫ్లాప్ హీరోకి ఏక్ దిన్తో లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది సాయి పల్లవి. మూడేళ్ల క్రితం షూట్ ప్రారంభమైన ఈ సినిమాను.. వన్ లవ్ అండ్ వన్ చాన్స్ అంటూ లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నారు మేకర్స్. అమరన్ షూటింగ్ .. ఈ మూవీ పార్లల్గా వర్క్ చేసినట్లు పల్లవి హెయిర్ స్టైల్ చెప్పకనే చెబుతోంది. డబ్బింగ్ విషయంలో మరొకరి ఛాన్స్ ఇవ్వని మేడమ్.. హిందీలోనూ తనే డబ్బింగ్ చెప్పుకుంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని.. కథ, ఆ కథలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఐడెంటిటినీ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. కానీ జునైద్ ఖాన్ లాంటి ప్లాప్ హీరోతో జోడీ కట్టడమంటే ఆమె కెరీర్ రిస్క్‌లో పడినట్లే. అందులోనూ బాలీవుడ్ ఎంట్రీలో. ఈ మూవీ హిట్టేతే ఓకే కానీ.. తేడా కొడితే.. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరీ బాలీవుడ్ ఆడియన్స్‌ను మీరాగా మెప్పిస్తుందో..? సీతగా మెస్మరైజ్ చేస్తుందో..? జునైద్ ఖాన్‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి.
Also Read : Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ టాక్.. హిట్టా.. ఫట్టా?
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!