Site icon NTV Telugu

Sai Pallavi : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. ‘ఏక్ దిన్’ ట్రైలర్ రిలీజ్

Ek Din

Ek Din

మెగా వారసుడు వరుణ్ తేజ్ ముకుంద, కంచెతో ఫ్రూవ్ చేసుకున్నప్పటికీ పూరీ జగన్నాథ్‌ లోఫర్, మిస్టర్స్ భారీ డిజాస్టర్స్ వరుణ్ తేజ్ కెరీర్‌పై ఎఫెక్ట్ చూపాయి. ఆ తర్వాత వచ్చిన ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వరుణ్. సోలో హీరోగా అతడి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా మారింది ఫిదా. ఫిదాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వరుణ్ తేజ్‌తో పాటు తను కూడా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది సాయి పల్లవి.

అక్కినేని నట వారసుడు నాగ చైతన్యకు సెకండ్ ఇన్నింగ్స్‌లా మారిన ఫిల్మ్ తండేల్. గత ఏడాది రిలీజైన ఈ ఫిల్మ్ 100 కోట్లు కలెక్ట్ చేసి చైతూ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా అవతరించింది. ఈ సినిమాకు ముందుకు హ్యాట్రిక్ డిజాస్టర్స్ టేస్ట్ చేశాడు ఈ అక్కినేని వారసుడు. ఇందులో బుజ్జితల్లిగా సాయి పల్లవికి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ కూడా కమర్షియల్ హిట్.  లవ్ టుడే రీమేక్‌గా వచ్చిన లవ్యాపాతో బోల్తా పడ్డ అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్.. మళ్లీ రీమేక్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఫ్లాప్ హీరోకి ఏక్ దిన్‌తో లైఫ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది సాయి పల్లవి. మూడేళ్ల క్రితం షూట్ ప్రారంభమైన ఈ సినిమాను.. వన్ లవ్ అండ్ వన్ చాన్స్ అంటూ లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నారు మేకర్స్. అమరన్ షూటింగ్ .. ఈ మూవీ పార్లల్‌గా వర్క్ చేసినట్లు పల్లవి హెయిర్ స్టైల్ చెప్పకనే చెబుతోంది. డబ్బింగ్ విషయంలో మరొకరి ఛాన్స్ ఇవ్వని మేడమ్.. హిందీలోనూ తనే డబ్బింగ్ చెప్పుకుంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని.. కథ, ఆ కథలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఐడెంటిటినీ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. కానీ జునైద్ ఖాన్ లాంటి ప్లాప్ హీరోతో జోడీ కట్టడమంటే ఆమె కెరీర్ రిస్క్‌లో పడినట్లే. అందులోనూ బాలీవుడ్ ఎంట్రీలో. ఈ మూవీ హిట్టేతే ఓకే కానీ.. తేడా కొడితే.. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరీ బాలీవుడ్ ఆడియన్స్‌ను మీరాగా మెప్పిస్తుందో..? సీతగా మెస్మరైజ్ చేస్తుందో..? జునైద్ ఖాన్‌కు బ్రేక్ ఇస్తుందో చూడాలి.

Also Read : Pawan Kalyan : ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెన్సార్ టాక్.. హిట్టా.. ఫట్టా?

Exit mobile version