Sai Pallavi: ఆ సినిమా షూట్‌లో ఏడ్చేసిన సాయి పల్లవి.. కారణం ఏంటంటే?

  • 2021 డిసెంబర్‌లో శ్యామ్‌ సింగరాయ్‌
  • సాయి పల్లవి కెరీర్‌లో ప్రత్యేకం
  • షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్న సాయి పల్లవి
Sai Pallavi Cried

Sai Pallavi Cried

నేచురల్‌ స్టార్‌ నాని, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. 2021 డిసెంబర్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నాని, సాయి పల్లవి కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఇద్దరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఇంటెన్స్‌, పవర్‌ఫుల్‌ ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో సాయి పల్లవి ఏడ్చారట.

అమరన్‌ సక్సెస్ సందర్భంగా తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌ చేస్తున్నపుడు ఆ రోజు షూట్‌ పూర్తయితే ఎంతో ఆనందంగా ఉండేది. నా సన్నివేశాలన్నీ చాలా వరకూ రాత్రి పూటనే చిత్రీకరించారు. రాత్రి షూటింగ్‌లు నాకు అలవాటు లేదు. పగలు నాకు నిద్రరాదు కాబట్టి రాత్రిళ్లు నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఒక్కోసారి తెల్లారేవరకు మేల్కొని ఉండాల్సి వచ్చేది. దాదాపు 30 రోజులు ఇలానే గడిచాయి. బిజీ షెడ్యూల్స్‌ కారణంగా రాత్రి శ్యామ్‌ సింగరాయ్‌ చేస్తూ.. ఉదయం మరో మూవీ సెట్‌కి వెళ్లేదాన్ని’ అని సాయి పల్లవి తెలిపారు.

Also Read: Maa Nanna Superhero OTT: ఓటీటీలో సుధీర్ బాబు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?

‘ఒకరోజు రాత్రి నన్ను చూడటానికి నా చెల్లి వచ్చింది. తనతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశా. ఒప్పుకొన్న సినిమాలు చేయాలనుంది కానీ.. ఓ రోజు విశ్రాంతి దొరికితే బాగుండు అంటూ నా బాధను షేర్ చేసుకున్నా. నా చెల్లె నేరుగా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి దగ్గరకు వెళ్లి.. మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా సెలవు ఇవ్వండి అని అడిగింది. ఆయన వెంటనే నా వద్దకు వచ్చి.. ఒకటి కాదు పది రోజులు తీసుకో, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు షూటింగ్‌కు రా అని అన్నారు. దాంతో నాకు విశ్రాంతి దొరికింది’ అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.