NTV Telugu Site icon

Sai Pallavi : సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో చూశారా.. అదిరిపోయింది అంతే..

saai

saai

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. న్యాచురల్ లుక్ తో వరుస సినిమాలను చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది.. ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. తాజాగా సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

చందు మొండేటి దర్శకత్వం లో రాబోతున్న సినిమా తండేల్… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది..నాగ చైతన్య మూడవసారి దర్శకుడు చందూ మొండేటితో కలిసి జాతీయవాద అంశాలతో కూడిన గ్రామీణ ప్రేమకథ తండేల్ సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా, వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది..

తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ గా వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.. సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి ఫోటోలను తీసుకొని వీడియోను డిజైన్ చేశారు.. నిజంగా వీడియో అదిరిపోయింది.. ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు..