Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..

Sai Durgha Tej Stand With Her Campaign,

Sai Durgha Tej Stand With Her Campaign,

మహిళల భద్రత, గౌరవం విషయంలో మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం, ఉమెన్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా చేపట్టిన ‘స్టాండ్ విత్ హర్’ (#StandWithHer) క్యాంపెయిన్‌లో ఆయన భాగస్వామి అయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రారంభమైన ఈ ఏడాది పొడవునా సాగే కార్యక్రమంలో.. మహిళలకు ఆపద కలిగినప్పుడు పురుషులు మౌనంగా ఉండకుండా, అండగా నిలబడాలనే అవగాహన కల్పిస్తున్నారు.

గతంలో పిల్లలపై జరుగుతున్న అసభ్యకర కామెంట్స్, ‘డార్క్ కామెడీ’ పేరుతో జరుగుతున్న వేధింపులపై సాయి దుర్గ తేజ్ ధైర్యంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటం చూసి నెటిజన్లు ‘హాట్సాఫ్ తేజ్ అన్నా’ అంటూ కొనియాడుతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ బాధ్యత గల పౌరుడిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తూ.. సాయి దుర్గ తేజ్ వంటి వారు ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కేవలం చట్టాలు చేస్తే సరిపోదని, ప్రతి పురుషుడు మహిళా భద్రత పట్ల సామాజిక బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కాగా దుర్గతేజ్ పంచుకున్న వీడియో లో ప్రతి ఒక్క మాటకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.