‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. నూతన దర్శకుడు రోహిత్ కె.పి. తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని, ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ హిట్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో తేజ్ ‘బాలీ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అసుర ఆగమన’ గ్లింప్స్ సినిమాలోని ఇంటెన్సిటీని, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను పరిచయం చేసి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించింది.
Also Read : Anil Ravipudi : అనిల్ రావిపూడి ’10వ’ సినిమా ఫిక్స్.. 2027 సంక్రాంతి కూడా బుక్ అయిపోయినట్టేనా !
ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘విరూపాక్ష’కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ మరోసారి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం 2026 మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నేడు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ వచ్చిన తాజా పోస్టర్ చూస్తుంటే సాయి తేజ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటబోతున్నారని స్పష్టం చేస్తోంది.
He may be a champion on field, but he's still a learner at home ❤️🏆
A Suriya and Venky Atluri film, is coming to Netflix after its theatrical release, in Tamil, Telugu, Hindi, Malayalam and Kannada#NetflixPandigai pic.twitter.com/aZX4w573Dy— Netflix India South (@Netflix_INSouth) January 15, 2026
