సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన బ్రో ప్లాప్ అవడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి తేజ్. కథ ప్రాముఖ్యం ఉన్నసినిమాలు చేయాలన్నా ఉద్దేశంతో నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాయి కెరీర్ లో 18వ సినిమాగా వస్తున్నా ఈ చిత్రానికి సంబరాల ఎటి గట్టు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దాదాపు రూ. 120 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి నేడు చిత్ర హీరో సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు కానుకగా గ్లిమ్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్. పురాతన కాలం నాటి పల్లెటూరు అక్కడ ఒక సమస్య వారికీ అండగా బాలి ఇలా ఒక్కో షాట్ ను అద్భుతంగా తెరకెక్కించారు. సాయి దుర్గ తేజ్ మేకోవర్ సూపర్బ్ గా ఉంది. అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం వంటి డైలాగ్స్ బాగున్నాయి. ఇక వీడియో చివర్లో నిప్పు కణికలు మధ్య చేతికి ఆయుధం ధరించి ఉన్న సాయి దుర్గా తేజ్ కనిపించే సీన్ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉందని చెప్పక తప్పదు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో తీసుకువస్తున్నారు.
