Sai Dharam Tej: ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను..అమ్మ గొప్పతనం అప్పుడే అర్థమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మెగా కాంపౌండ్ నుంచి వచ్చి హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే, య్యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అయిన నిఖిల్ తో కలిసి చేసిన పాడ్ కాస్ట్ లో ఆయన చాలా విషయాలు తెలియజేసాడు.. తను పడ్డ కష్టాలు గురించి తెలిపాడు..”ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అలా ఎప్పుడైనా జరిగిందా?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు సాయి ధరమ్ తేజ్. “2009 అప్పుడే యాక్టింగ్ ఫీల్డ్ లోకి వస్తున్నాను. 2010లో యాక్టింగ్ కోర్సు అయిపోయి వచ్చాను.
2011-12లో ‘రేస్’ సినిమా ఓపెన్ అయిపోయింది. ఫైనాన్సియల్ గా చాలా లోగా ఉన్నాను. మీటింగ్ కి వెళ్లాలి. డబ్బులు లేవు. కారులో డీజిల్ కొట్టించాలి. అప్పట్లో ప్రిపెయిడ్ ఫోన్ దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదు. పెట్రోల్ కొట్టించాలంటే రూ.500 కావాలి. రూ.450 పెట్రోల్ కొట్టించాలి. రూ.50 తో రీఛార్జ్ చేయించుకోవాలి అని అనుకున్నాను. పెట్రోల్ కొట్టించాను. రూ.50 డ్రా చేయలేం. మినిమమ్ ఉండాలి. ఎలాగో ట్రై చేశాను. బ్యాలెన్స్ చూస్తే రూ. లక్ష నుంచి రూ.రెండు లక్షలు ఉన్నాయి. అర్థంకాలేదు. వెంటనే అమ్మకి ఫోన్ చేశాను. “రాత్రి నువ్వు అన్నావు కదా డబ్బులు లేవని, అందుకే వేశాను. ఈ నెల గడిచిపోతుంది కదా” అన్నారు. ఏటిఎం నుంచి బయటికి వచ్చి ఏడ్చేశాను. అది అమ్మ పవర్ అంటే. ఎప్పుడు ఏం ఇవ్వాలో అమ్మకే కచ్చితంగా తెలుస్తుంది. అదే అమ్మ గొప్పతనం అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు..యాక్సిడెంట్ తర్వాత పవన్ కల్యాణ్ తో నటించిన ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ మంచి విజయం అందుకున్నాడు.ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో ‘గాంజా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా టైటిల్ పై వివాదం నడుస్తోంది. సినిమా టైటిల్ మార్చాలని మూవీ టీమ్ కి నోటీసులు పంపారు. ఇక ఈ సినిమాని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండగా.. పూజా హెగ్డే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తున్నట్లు సమాచారం. దీనిపైచిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!