అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురును కేవలం క్రికెట్ బ్యాట్ కోసం నిందితుడు ప్రాణాలు తీయడంతో బాలిక తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని తెలిపాడు. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయానని విలపించాడు.. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న వాడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. మా బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదన్నాడు.
Also Read:Kukatpally Sahasra Case: 5 రోజులు సమయం ఎందుకు పట్టింది? ఓ పిల్లోడు ఏం క్లూ ఇచ్చాడంటే.. !
ఇంత దారుణం తర్వాత కూడా మా ఇంటికి వచ్చాడంటే, ఎంత క్రూరమైన ఆలోచన ఉందో అర్థం చేసుకోవాలి అని సహస్ర తండ్రి తెలిపాడు. ఏ తల్లిదండ్రులకు మాలాగా గర్భ శోకం ఉండకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ కేసులో పదోతరగతి బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ కోర్టుకు తరలించారు. కొన్ని సినిమాలు, వెబ్ సరీస్ లు పిల్లల్లో కౄరమైన ఆలోచనలకు దారితీస్తున్నాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
