Site icon NTV Telugu

నేటి నుంచి ఏపీలో దివ్యాంగులకు సదరం క్యాంపులు

నేటి నుండి ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులకు సదరం క్యాంపులు ఏర్పాటు చేయనుంది జగన్‌ సర్కార్‌. ఈ కార్యక్రమం ద్వారా 24 గంటల్లో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటలకే సదరం క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 నుండి స్లాట్ల బుకింగ్ మీసేవ కేంద్రాల్లో కొనసాగుతున్నది. అటు దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసింది వైద్య ఆరోగ్య శాఖ.

read also : ఇండియా కరోనా అప్డేట్‌… తగ్గుతున్న కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 171 ప్రభుత్వ ఆసుపత్రులలో సదరం క్యాంపులు ఏర్పాటు చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు , ఏరియా , జిల్లా, టీచింగ్ ఆసుపత్రులలో క్యాంపులుఏర్పాటు చేశారు. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన సదరం క్యాంపులు నేటి నుండి తిరిగి ప్రారంభం అయ్యాయి. ఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ఏపీవివిపి కమిషనర్… సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు.

Exit mobile version