Site icon NTV Telugu

Sadar Festival: హైదరాబాద్ లో మొదలైన సదర్ సందడి.. ప్రత్యేక ఆకర్షణగా గుమాన్ కాళీ దున్నరాజు

Sadar Festival

Sadar Festival

హైదరాబాద్ నగరంలో సదర్ సందడి మొదలైంది. గుమాన్ కాళీ దున్నరాజు సదర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేరళ నుంచి తీసుకువచ్చిన గుమాన్ కాళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. 7కోట్ల ఖర్చు, 2500 కేజీల బరువు, 7 అడుగుల ఎత్తుతో అట్రాక్ట్ చేస్తోంది. నిర్వాహకుడు మధు యాదవ్ హర్యానా నుంచి ప్రత్యేకంగా 15 దున్నరాజులను తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా ప్రతియేడు దీపావళి వేళ సదర్ ఉత్సవాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దున్నపోతులు సందడి చేస్తాయి. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు యాదవులు తమ ఐక్యతను చాటుతూ సదర్‌ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.. ఒక్కప్పుడు హైదరాబాద్‌కు పరిమితమైన ఈ ఆనవాయితీ క్రమంగా కాలనీలు.. టౌన్‌లు, గ్రామాలకు కూడా విస్తరించింది.

Exit mobile version