Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. గ్రౌండ్ లో పరుగుల వరద పారించడమే కాదు.. గ్రౌండ్ బయట కూడా తన మృదువైన స్వభావం, సరదా స్వభావంతో అనేక మార్లు ఆయన వారాంతాల్లో నిలుస్తుంటారు. ఇలాగే తాజాగా మరోసారి సచిన్ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. విమాన ప్రయాణ సమయంలో తన కుమార్తె సారా టెండూల్కర్, కోడలు సానియా చాందోక్‌లతో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సచిన్ ప్రయాణ సమయంలోనూ ఆటపై తనకు ఉన్న ప్రేమను చూపించాడు. విమానంలోనే బ్యాటింగ్ చేస్తున్నట్లుగా సరదాగా నటిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియోను సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ పోస్టుకు ఆయన “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు” (No matter what the altitude, the attitude shouldn’t change) అనే క్యాప్షన్ జోడించాడు.
సచిన్ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వీడియో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఆయనలోని క్రికెట్ పట్ల ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు పొగుడుతున్నారు.
Altitude jo bhi ho, attitude change nahi hona chahiye. 😄 pic.twitter.com/TPbsNUe2Op
— Sachin Tendulkar (@sachin_rt) June 12, 2026

