Site icon NTV Telugu

Sachin-Thaman: మాస్టర్ బ్లాస్టర్‌తో తమన్.. త్వరలో కలసి పనిచేస్తా అంటూ..

Sachin Thaman

Sachin Thaman

Sachin-Thaman: ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Thaman) తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)తో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సంగీతంతో పాటు క్రికెట్‌ను కూడా అమితంగా ప్రేమించే తమన్, డల్లాస్ నుండి దుబాయ్ వరకు సచిన్‌తో కలిసి ప్రయాణించారు. ఈ అద్భుతమైన సమయాన్ని “గాడ్ ఆఫ్ క్రికెట్‌తో ప్రయాణం”గా అభివర్ణించారు. వీరిద్దరూ విమానంలో పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్న ఫోటోను తమన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

Pawan Kalyan Tour: రాష్ట్రవ్యాప్త పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధం.. ఫస్ట్ ఆ జిల్లాకే…

ఈ సందర్భంగా.. తాను సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)లో ఆడిన మ్యాచ్‌ల బ్యాటింగ్ క్లిప్‌లను మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ కు చూచాడని తెలిపాడు తమన్. ఆ వీడియోలను చూసిన తర్వాత సచిన్ టెండూల్కర్ స్వయంగా తనని ప్రశంసించినట్లు తెలిపాడు. ముఖ్యంగా “మీ బ్యాట్ స్పీడ్ అద్భుతంగా ఉంది” (You have a great bat speed) అని మెచ్చుకున్నట్లు తమన్ రాసుకొచ్చాడు. ఆ తర్వాత త్వరలో సచిన్ తో కలిసి పనిచేస్తా అని చెప్పుకొచ్చాడు.

The Raja Saab: ప్రభాస్ కొత్త జోనర్.. యూరప్‌లో ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్న మారుతి

ఈ పోస్ట్ మొత్తంలో అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే… సచిన్‌తో కలిసి త్వరలో పనిచేసే అవకాశం ఉందని తమన్ హింట్ ఇవ్వడమే. ఇకపోతే తమన్ సంగీత ప్రపంచంలో బిజీబిజీగా ఉండగా, సచిన్ రిటైర్మెంట్ తర్వాత కూడా వివిధ క్రీడా, వ్యాపార రంగాల్లో చురుకుగా ఉన్నారు. మరి వీరిద్దరూ ఏ ప్రాజెక్ట్ కోసం కలవబోతున్నారు? అది క్రికెట్ సంబంధితమా, సినిమా సంబంధితమా, లేక మరేదైనా కొత్త రంగంలోనా అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version