NTV Telugu Site icon

Sabitha Indra Reddy : పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటి.?

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉంటే తప్పేమిటని తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ ఫొటో, గుర్తును తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె సూచించారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘పాఠ్యపుస్తకాలలో కేసీఆర్ పేరు ఉంటే తప్పేంటి? తాము పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు ఆలస్యంగా అందించే సంస్కృతికి ముగింపు పలికాం. ఆరునెలలు ముందు నుంచే ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లి పుస్తకాలు,యూనిఫారాలను విద్యార్థులకు పాఠ్య అందించే ప్రయత్నం చేశాం. తాము ఏటా 23 లక్షల మంది విద్యార్థులకు రూ.108 కోట్లు వెచ్చించి రెండు జతల యూనిఫారాలు, రూ.200 కోట్లకు వెచ్చించి రూ.1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించి సకాలంలో ఇచ్చాం. ఇక రాష్ట్రంలో తొలిసారిగా ఏ ప్రభుత్వం చేయనట్లుగా రూ.34.70 కోట్లతో 11.27 లక్షల మందికి వర్కబుక్స్ రూ.56.24 కోట్లతో, రూ.12.30 కోట్లతో ఉచిత నోట్ బుక్స్ పంపిణీకి శ్రీకారం చుట్టాము. విద్యార్థులందరికీ తాము యూనిఫారాలు,పాఠ్యపుస్తకాలు సందర్భంగా గుర్తుచేశారు. జూన్ 12 అందచేశాము.’ అని పోస్ట్‌ చేశారు.

అంతేకాకుండా.. ‘ కేసీఆర్ గారి ఫోటో, కేసీఆర్ గారి గుర్తులు తొలగించాలని ఆలోచనను పక్కన పెట్టి పాలన పై దృష్టి పెట్టండి. ఆరు నెలలైనా ఈ ప్రభుత్వం పాలన పై దృష్టి సాధించలేదు అనడానికి ఇది ప్రత్యేక నిదర్శనం. తమిళనాడు లో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి కాగానే జయలలిత గారి ఫోటో తో ఉన్న బుక్స్, బ్యాగ్ ను యధావిదంగా విద్యార్థులకు ఇచ్చి తమ హుందాతనాన్ని చాటుకున్నారు. పక్కా రాష్ట్రం సీఎం గారు, జగన్ రెడ్డి బొమ్మతో గల కిట్లను పంపిణీ చేయాలని, ప్రజాధనం వృధా చేయకండని ఆదేశించి ఎంతో హుందాగా వ్యవహరించారు. మరి మీ హుందాతనం ఎక్కడికి పోయింది?

విద్యార్థులకు ఇచ్చిన బుక్స్ లో కేసీఆర్ గారి పేరు ఉంది అని బుక్స్ వెనక్కి తెప్పించడం పేజీలను చింపివేయడం, ఆ పేజీలపై మరో పేజీ అతికించడం సమంజసమా. ఈ అనాలోచిత చర్య వల్ల ప్రజాధనం వృధా కాదా ? చింపివేసిన పేజీల వెనకాల వందేమాతరం,జనగణమన గేయాలు ప్రతిజ్ఞలు ఉన్న పట్టింపు లేదా? కేసీఆర్ గారి మీద కోపం తో జాతీయ గీతాలని కూడా అవమానిస్తారా ?ఈ ప్రభుత్వానికి ఇది తగునా? ఈ సంవత్సరం బుక్స్ తో పాటు బ్యాగ్స్ ఇవ్వమని కేసీఆర్ గారి ఆదేశం తో విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది దానిని అమలు చేయమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించండి, పాలన మీద దృష్టి పెట్టమని ఈ ప్రభుత్వానికి నా చిన్న సలహా.’ అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.