Site icon NTV Telugu

Sabarimala Accident: శబరిమలలో ఏపీ భక్తుల మీదకి దూసుకువెళ్లిన ట్రాక్టర్..

Sabarimala Accident

Sabarimala Accident

Sabarimala Accident: శబరిమల సన్నిధానం వద్ద ఒక ట్రాక్టర్ భక్తుల మీదకి దూసుకువెళ్లింది. కొండ దిగే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఏపీకి చెందిన 9 మంది భక్తులపై దూసుకువెళ్లింది. ప్రస్తుతం వాళ్లందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా, ఏటవాలు రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పింది. ఇప్పటికే సన్నిధానం పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

READ ALSO: Messi-CM Revanth : క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన మ్యాచ్

పారిశుద్ధ్య కార్మికుల కథనం ప్రకారం.. ట్రాక్టర్‌లో సుమారు ఐదుగురు వ్యక్తులు ఉన్నారని వెల్లడించారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడిన ముగ్గురిని సన్నిధానం ఆసుపత్రి నుంచి వేరే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గాయపడిన వారందరినీ పంబలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని, గాయపడిన వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని అన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.

READ ALSO: Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్..

Exit mobile version