NTV Telugu Site icon

Sabarimala Temple Income: 39 రోజుల్లోనే.. 200 కోట్లు దాటిన శబరిమల ఆలయ ఆదాయం!

Sabarimala Temple Income

Sabarimala Temple Income

Sabarimala Temple Close Today Due To Madalapuja: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సీజన్‌లో డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దాంతో ఆలయ ఆదాయం కూడా పెరిగింది. శబరిమల ఆలయ ఆదాయం ఈ సీజన్లో రూ. 200 కోట్లు దాటింది. గత 39 రోజుల్లో (డిసెంబర్ 25 వరకు) రూ. 204.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) మంగళవారం తెలిపింది.

భక్తులు సమర్పించిన నాణేల ద్వారా రూ. 63.89 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ. 96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా రూ. 12.38 కోట్లు వచ్చినట్లు టీడీబీ తెలిపింది. భక్తులు సమర్పించిన నాణేలను పూర్తిగా లెక్కిస్తే.. ఆదాయం మరింత పెరుగుతుందని టీడీబీ అధికారులు చెప్పారు. డిసెంబర్ 25 వరకు శబరిమలను 31,43,163 మంది దర్శించుకున్నారని.. 7,25,049 మందికి అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు. 40 రోజుల్లో 208 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Central Congo Floods: సెంట్రల్‌ కాంగోలో భారీ వరదలు.. 22 మంది మృతి! పలువురు గల్లంతు

బుధవారం నిర్వహించే మండల పూజకు టీడీబీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పూజ అనంతరం బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిలక్కు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా భక్తుల రద్దీ ఉంది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. జనవరి 15న మకరవిలక్కు పూజ నిర్వహించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవసం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు.

Show comments