NTV Telugu Site icon

Sabarimala Darshan Timings: భక్తులకు శుభవార్త.. మధ్యాహ్నం 3 గంటల నుంచే అయ్యప్ప దర్శనాలు!

Sabarimala Darshan Timings

Sabarimala Darshan Timings

Sabarimala Darshan Hours Extended: ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని టీబీడీ గంటసేపు పొడిగించింది. ప్రస్తుతం రోజులో రెండో భాగంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు మొదలై.. రాత్రి 11 గంటల వరకు కొనసాగనున్నాయి.

Also Read: YSR Law Nestham: వారికి శుభవార్త.. ఈ రోజే నిధులు విడుదల

ప్రతిరోజూ వర్చువల్‌ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు, స్పాట్‌లో 30 వేల బుకింగ్స్‌ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్‌ కుమార్‌ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. దర్శనాలను త్వరగా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజూ 17 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీబీడీ పేర్కొంది. దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, బిస్కెట్లను అందిస్తున్నట్లు తెలిపింది.