Site icon NTV Telugu

SA20 2026: అభిమానికి గాయం.. క్షమాపణతో పాటు సంతకం చేసిన జెర్సీ గిఫ్ట్..!

Sa20 2026

Sa20 2026

SA20 2026: SA20 2026 లీగ్‌లో MI కేప్‌టౌన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ర్యాన్ రికెల్టన్ తన క్రీడాస్ఫూర్తితో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అనుకోకుండా బంతి తగిలి గాయపడిన ఓ మహిళా ప్రేక్షకురాలికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పడంతో పాటు సంతకం చేసిన తన మ్యాచ్ జెర్సీని పంపి ఉదారతను చాటాడు.

Poco M8 5G: ఇండియాలో స్టార్ట్ అయిన Poco M8 5G సేల్.. ధరలు, ఆఫర్లు ఇవే!

ఈ ఘటన జోహానెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో MI కేప్‌టౌన్, జొబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరులో చోటు చేసుకుంది. MI కేప్‌టౌన్ ఇన్నింగ్స్ ప్రారంభ దశలో రికెల్టన్ లెగ్ సైడ్ వైపు కొట్టిన భారీ సిక్సర్ నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లి ఓ ప్రేక్షకురాలి కిటికీ బలంగా తాకింది. ఆ సమయంలో అక్కడున్న భద్రతా సిబ్బంది, వైద్య బృందం వెంటనే స్పందించి ఆమెకు ప్రాథమిక చికిత్సను అందించారు.

OTP Scam: సైబర్ అలర్ట్.. ఒక్కసారి చెప్పారో బ్యాంకు ఖాతా ఖాళీ..!

కాకపోతే ఆ మహిళకు చెంప ఎముక (చీక్‌బోన్) ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న రికెల్టన్, అభిమానిని గురించి ఆరా తీసి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అహాబు చేసిన పనిని MI కేప్‌టౌన్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో సంఘటనపై తన విచారం వ్యక్తం చేశాడు. అభిమానిని త్వరగా కోలుకోవాలని కోరుతూ, సంతకం చేసిన తన మ్యాచ్ జెర్సీని ఆమెకు గిఫ్ట్ గా పంపించాడు. అలాగే ముక్యముగా తనవల్ల జరిగిన సంఘటనకు ఆమెను క్షమంచాని కోరడం హైలెట్. ఫ్రాంచైజీ కూడా స్పందిస్తూ.. గాయపడిన అభిమానిని ప్రస్తుతం కోలుకుంటున్నారని, రికెల్టన్ చూపిన మానవత్వంకు ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించాయి.

Exit mobile version