NTV Telugu Site icon

SA vs PAK: పాకిస్తాన్ పై గెలుపుతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న దక్షిణాఫ్రికా

Sa Win

Sa Win

SA vs PAK: దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. సెంచూరియన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేసి లీడ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 237 పరుగులకే కుప్పకూలింది. దింతో కావాల్సిన టార్గెట్ 150 పరుగులు చేసి దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున ఐడెన్ మార్క్రామ్ మంచిప్రదర్శన చేశాడు. కాగా, కగిసో రబడా బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి విజయాన్ని అందించాడు.

Also Read: Recharge Best Plans: ఓటీటీ ప్లాన్స్ అందించే బెస్ట్ రీఛార్జ్‭లు ఇవే..

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులు చేయడంలో.. బాబర్ ఆజం, షాన్ మసూద్‌తో సహా చాలా మంది దిగ్గజ ఆటగాళ్ళు ఫ్లాప్‌ అయ్యారు. కమ్రాన్ గులామ్ 54 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టు 237 పరుగులకే ఆలౌటైంది. సౌద్ షకీల్ రెండో ఇన్నింగ్స్‌లో తన సత్తా చాటుతూ 84 పరుగులు చేశాడు. బాబర్ ఆజం 50 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇవి కాకుండా ఎవరూ ఆడలేకపోయారు.

Also Read: Game Changer First Review: గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోండమ్మా!

ఇక మరోవైపు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయడంలో, ఎడిన్ మార్క్రామ్ 89 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కార్బిన్ బాష్ 81 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోయింది. కానీ కగిసో రబడా, మార్కో జాన్సన్ జట్టును కాపాడారు. రబడ 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా జాన్సెన్ 16 అజేయంగా పరుగులు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు కూడా చేరుకుంది.