SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SA vs IND Women: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో ఎట్టకేలకు భారత మహిళల జట్టు విజయం సాధించింది. జోహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళలపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో భారత్ మూడు ఓటమిల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్ 43 పరుగులతో భారత్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 పరుగులు చేసి సహకరించగా, చివర్లో దీప్తి శర్మ 36 నాటౌట్, రిచా ఘోష్ 34 నాటౌట్ వేగంగా పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లో ఎలీజ్-మరి మార్క్స్, కేలా రెయినీకేలు చెరో రెండు వికెట్లను తీసుకున్నారు.
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మహిళా జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. ఆ తర్వాత సునే లూస్ (40), టాజ్మిన్ బ్రిట్స్ (30) పరుగులతో పోరాటం చేశారు. అయితే మధ్య ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపుకు మళ్లింది. దీప్తి శర్మ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. టీమిండియా ఇతర బౌలర్లలో క్రాంతి గౌడ్, శ్రీ చరణి, కశ్వీ గౌతమ్ తలో వికెట్ తీసి సహకరించారు. చివరికి దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 171/9 వద్ద ఆగిపోయింది. దీంతో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు సిరీస్ ను 3-1కి చేర్చింది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!