Site icon NTV Telugu

Abhishek Sharma: ఏం అభిషేక్.. ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతావా?

Abhishek Sharma Trolls

Abhishek Sharma Trolls

టీమిండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పేలవ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో కేవ‌లం 7 ప‌రుగులే చేసిన అభిషేక్‌.. రెండో టీ20లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. పోర్ట్ ఎలిజిబెత్‌లో కోయిట్జీ బౌలింగ్‌లో చెత్త ఆడి ఔట‌య్యాడు. జింబాబ్వేపై ఒక సెంచరీ మినహా.. అభిషేక్ టీ20ల్లో రాణించడంలో విఫలమయ్యాడు. దాంతో అతడిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

జింబాబ్వే సిరీస్‌తో అభిషేక్ శ‌ర్మ టీ20తో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు భార‌త్ త‌ర‌పున 9 మ్యాచ్‌లు ఆడాడు. జింబాబ్వే సిరీస్‌లో సెంచ‌రీ మిన‌హా.. చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేకపోయాడు. తొమ్మిది టీ20 ఇన్నింగ్స్‌లలో ఎనిమిదింటిలో క‌నీసం 20 పరుగుల మార్కును కూడా దాట‌లేక‌పోయాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో వరుసగా 0(4), 100(47), 10(9), 14(11), 16(7), 15(11), 4(4), 7(8), 4(5) రన్స్ చేశాడు.

Also Read: Varun Chakaravarthy: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. ‘ఒకే ఒక్కడు’!

అభిషేక్ శ‌ర్మ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 16 గేమ్‌లలో 484 పరుగులు బాదాడు. ఐపీఎల్ మాదిరి అంత‌ర్జాతీయ మ్యాచ్‌లలో రాణించలేకపోతున్నాడు. యశస్వి జైశ్వాల్‌కు బ్యాక‌ప్‌గా జ‌ట్టులోకి వ‌చ్చిన అభిషేక్.. త‌న మార్క్‌ను చూపించడంలో విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అతడిపై ట్రోల్స్ వస్తున్నాయి. ‘అభిషేక్.. ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతావా?’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version