Site icon NTV Telugu

SA vs IND: ఒక్కరోజే 16 వికెట్లు నేలమట్టం.. ముగిసిన రెండో రోజు..!

Sa Vs Ind

Sa Vs Ind

SA vs IND: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ రెండో రోజు అసలు టెస్ట్ క్రికెట్ ఎలాంటి అనూహ్య మలుపులు తెస్తుందో అచ్చం అలాగే కొనసాగింది. ఒక్క రోజులోనే 16 వికెట్లు పడడంతో మ్యాచ్ నిరాశాజనకంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ తర్వాత భారత్ 189 పరుగులకే కుప్పకూలిపోవడం ఈ రెండూ బౌలర్ ఫ్రెండ్లీ పిచ్ పరిస్థితులను స్పష్టం చేశాయి.

SSMB29 Updates: మాట తప్పని జక్కన్న.. 15 ఏళ్ల క్రితం ఫిక్స్ అయిన మహేష్ బాబు కాంబో

ఇక ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు ఆడిన దక్షిణాఫ్రికా మరోసారి భారత బౌలర్ల స్పిన్, పేస్ కాంబినేషన్‌కు బలైంది. రెండో రోజు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 93 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో పడింది. క రెండో రోజు ఆట ముగిసే సమయానికి 63 పరుగుల ఆధిక్యం ఉన్నా చేతిలో ఇంకా ముగ్గురు బ్యాట్స్మెన్స్ మాత్రమే ఉండటంతో మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్‌లోనే ఫలితం దిశగా వెళ్లనుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో రికెల్టన్, మార్క్రమ్ మంచి ఆరంభం ఇచ్చినా, మధ్య ఓవర్లలో బుమ్రా తన అద్భుతమైన స్పెల్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. 14 ఓవర్లలో 5 మెడెన్స్‌తో 27 పరుగులకే ఐదు వికెట్లు తీశాడు. సిరాజ్, కుల్దీప్ కూడా కలిసివచ్చి మొత్తం సౌతాఫ్రికా లైనప్‌ను 159కే ముగించారు. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, జడేజా వంటి కీలక బ్యాట్స్‌మెన్ చిన్న ఇన్నింగ్స్‌లతో మాత్రమే ప్రతిఘటన అందించగలిగారు. సైమన్ హర్మర్ (4/30) మరియు జాన్సెన్ (3/35) బౌలింగ్‌లో అద్భుతం చేసి భారత్‌కి పెద్ద లీడ్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. శుభ్‌మ‌న్ గిల్ గాయంతో రిటైర్డ్ హర్ట్ కావడం టీమ్‌కు పెద్ద దెబ్బగా మారింది.

ప్రత్యేక రెడ్ వెర్షన్, 200MP టెలిఫోటో కెమెరాలతో ఫ్లాగ్‌షిప్ సంచలనం Vivo X300 సిరీస్ లాంచ్ కు సిద్ధం..!

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ మరింత కష్టాలను ఎదుర్కొంది. జడేజా తన స్పిన్ మాయతో 4 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి గట్టి దెబ్బ కొట్టాడు. దీనితో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ పూర్తిగా తడబడింది. కెప్టెన్ బవుమా మాత్రం ఒంటరిగా పోరాడుతూ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Exit mobile version