Site icon NTV Telugu

Sa Re Ga Ma Pa Season 16: ఫైనల్స్‌కు గెస్ట్‌లుగా నాగచైతన్య, సాయిపల్లవి.. టైటిల్ గెలుచుకునేది ఎవరు?

Sa Re Ga Ma Pa Season 16

Sa Re Ga Ma Pa Season 16

తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీతెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి మనసుని హత్తుకునే పాటలు,అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీతెలుగు పాపులర్ షో సరిగమప సీజన్ 16‌‌- ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో కొనసాగుతున్నసరిగమప 16 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి ముఖ్య అతిథులుగా ఉత్కంఠగా సాగిన సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే, ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీజీతెలుగులో!

ఈ సీజన్ కు ప్రముఖ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ఎంపికైన గాయనీగాయకులు విలేజ్ వోకల్స్, సిటీ క్లాసిక్స్, మెట్రో మెలొడీస్ మూడు జట్లుగా పోటీపడ్డారు. ఈ జట్లకు ప్రముఖ గాయకులు రేవంత్, రమ్య బెహర, అనుదీప్ దేవ్ మెంటర్లుగా వ్యవహరించారు. మెంటర్స్ మార్గదర్శకత్వంలో సోలో, డ్యూయెట్, గ్రూప్ యాక్ట్స్ వంటి క్లిష్టమైన రౌండ్లను ఎదుర్కొని ఆరుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు.

ఆరంభం నుంచీ అద్భుతమైన ప్రదర్శనలతో రాణిస్తున్న సాత్విక్, మేఘన, వైష్ణవి, మోహన్, అభిజ్ఞ, మానస ఫినాలేకు చేరుకుని టైటిల్ బరిలో నిలిచారు. ఈ ఆరుగురు సరిగమప 16-ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ టైటిల్ కోసం పోటీపడనున్నారు.ఉత్కంఠగా సాగనున్న ఈ గ్రాండ్ ఫినాలేకు తండేల్ చిత్ర బృందం నుంచి హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతేకాదు సీనియర్ నటి రాధ, హీరో విశ్వక్ సేన్ ఈ ఫినాలే ఎపిసోడ్కి హాజరై ఫైనలిస్ట్ల్లో ఉత్సాహం నింపారు. ప్రముఖ గాయని మంగ్లీ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వగా, సీరియల్ నటులు నిసర్గ గౌడ, ప్రీతి శర్మ, అభినవ్, సంగీత, పృథ్వీ, సాయికిరణ్ హాజరై ఫైనలిస్టులకు తమ మద్దతు తెలిపారు.

రసవత్తరంగా సాగే ఈ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులు పలు మ్యూజికల్ రౌండ్లలో పోటీపడి ప్రేక్షకులను అలరిస్తారు. ఈ గ్రాండ్ ఫినాలేలో గెలిచిన కంటెస్టెంట్ సరిగమప 16-ది నెక్ట్స్సింగింగ్ యూత్ ఐకాన్ టైటిల్తోపాటు పదిలక్షల నగదుని కూడా గెలుచుకోనున్నారు. హోరాహోరీగా సాగే ఈ సంగీత సమరంలో నిలిచి గెలిచేదెవరో తెలుసుకోవాలంటే తప్పకుండా చూడండి సరిగమప 16-ది నెక్ట్స్సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ ఫినాలే మీ జీ తెలుగులో మాత్రమే!

Exit mobile version