S.S.Rajamouli Birthday: రాజమౌళి పేరుకు ముందున్న ఎస్.ఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S.S.Rajamouli Birthday: ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి’ వంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఎంతో చూపించాడు. ఈ రోజు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి ఒక్కరూ రాజమౌళి అంటే గుర్తుపట్టే విధంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండియాస్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరంటే అది రాజమౌళినే. తను మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 1973 అక్టోబర్ 10న జన్మించిన ఎస్ఎస్ రాజమౌళి నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.
సౌత్ ఇండియన్ స్క్రిప్ట్ రైటర్ కెవి విజయేంద్ర ప్రసాద్, రాజా నందిని దంపతులకు జన్మించారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన కుటుంబం మొత్తం సినిమాలతో ముడిపడి ఉండడంతో చిన్ననాటి నుంచే తనకు సినిమా పరిజ్ఞానం ఉంది. నిజానికి రాజమౌళి తన కెరీర్‌ని ఈటీవీ తెలుగు షోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించాడు. అయితే 2001వ సంవత్సరంలో స్మాల్ స్క్రీన్‌కి గుడ్‌బై చెప్పి వెండితెరకు వెళ్లాడు. దర్శకుడిగా రాజమౌళి తొలి సినిమా ‘స్టూడెంట్ నెం.1’. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత రాజమౌళి వెనుదిరిగి చూసుకోలేదు.
Also Read
Read Also:Hyderabad: నార్సింగిలో భారీగా కరెన్సీ పట్టివేత.. రూ.88 లక్షలు సీజ్
2001 సంవత్సరంలో రాజమౌళి వెండితెరపై తన ప్రయాణాన్ని ప్రారంభించడమే కాకుండా.. అదే సంవత్సరంలో రమా రాజమౌళిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లినాటికే రమాకు విడాకులై.. ఓ కొడుకు కూడా ఉన్నాడు. రాజమౌళి, రామా ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు. రాజమౌళి కూడా రమకు తన మొదటి భర్తనుంచి విడాకులు తీసుకోవడానికి చాలా సాయం చేశాడు. ఈ క్రమంలోనే రాజమౌళి తన ప్రేమను రమకు వ్యక్త పరిచాడు. వారిద్దరూ చాలా సింపుల్ గా కోర్టు పెళ్లి చేసుకున్నారు.
రాజమౌళి పేరులో ఎస్ఎస్ అంటే ఏమిటి?
రాజమౌళి పేరులో ఎస్ఎస్ అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నిజానికి, SS అంటే శ్రీశైలం శ్రీ, ఎందుకంటే రాజమౌళి పూర్తి పేరు శ్రీశైలం శ్రీ రాజమౌళి. సౌత్ ఇండియన్ సినిమాలో ఆయన టాప్ డైరెక్టర్ అయినప్పటికీ.. బాహుబలి తర్వాతే ఆయన్ను దేశం మొత్తం గుర్తించడం ప్రారంభించింది. సినీ పరిశ్రమలోని కొందరు ఆయనను జక్కన్న అని ముద్దుగా పిలుచుకుంటారు.
Read Also:KL Rahul: గ్యాపే దొరకలే.. చాలా అలసిపోయా: కేఎల్ రాహుల్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు