NTV Telugu Site icon

K.Vishwanath: విశ్వనాథ్ ‘ఎస్’ సెంటిమెంట్!

Director

Director

K.Vishwanath:’ఎస్’ ఫర్ సక్సెస్ అంటారు. విశ్వనాథ్ కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. తన దగ్గరకు ఎవరైనా కొత్త నిర్మాతలు వస్తే, వారితో సినిమాలు తీసే టప్పుడు టైటిల్ లో ‘ఎస్’ అనే అక్షరంతో ఆరంభమయ్యేలా చూసేవారు. క్రాంతి కుమార్, ఛటర్జీ కలసి విశ్వనాథ్ తో సినిమా తీయాలనుకున్న సమయంలో ఈ సెంటిమెంట్ ఆరంభించారు విశ్వనాథ్. అలా ఆయన దర్శకత్వంలో ‘ఎస్’ అక్షరంతో మొదలైన టైటిల్ తో తెరకెక్కిన తొలి చిత్రం ‘శారద’. ఈ సినిమా మంచి విజయం సాదించి, తరువాత క్రాంతి కుమార్, ఛటర్జీ నిర్మాతలుగా నిలదొక్కుకొనేలా చేసింది. అలాగే ఏడిద నాగేశ్వరరావు తన మిత్రులు కొందరితో కలసి వచ్చి సినిమా నిర్మించాలని విశ్వనాథ్ దగ్గరకు వస్తే వారితో ‘సిరిసిరిమువ్వ’ తీశారు. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలుసు.

K.Vishwanath: విశ్వనాథ్ చిత్రాలతో ప్రతిభ చూపిన స్టార్స్!

ఇక యువచిత్ర అధినేత కె.మురారి నిర్మాతగా తొలి సినిమా విశ్వనాథ్ తోనే తీయాలని భావించారు. ఆయన అభిరుచికి తగ్గట్టుగా సినిమా తీస్తూ ‘సీతామాలక్ష్మి’ని అందించారు విశ్వనాథ్. ఈ సినిమా మంచి విజయం సాధించి, తరువాత యువచిత్ర సంస్థ నిలదొక్కుకొనేలాచేసింది. ఏడిద నాగేశ్వరరావు మరో నిర్మాత శ్రీరాములుతో కలసి విశ్వనాథ్ దర్శకత్వంలో తీసిన చిత్రమే ‘శంకరాభరణం’. ఆ సినిమా ఏ స్థాయిలో అలరించిందో చెప్పక్కర్లేదు. ఆ తరువాత కూడా విశ్వనాథ్ ఈ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. అలా ఆయన దర్శకత్వంలో “శుభోదయం, సిరిమువ్వల సింహనాదం, సప్తపది, శుభలేఖ, సాగరసంగమం, స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వరాభిషేకం, శుభప్రదం”వంటి చిత్రాలు తెరకెక్కాయి. కొత్త నిర్మాతలకే ‘ఎస్’ అనే లెటర్ సెంటిమెంట్ ను పాటించక, తనకు అనుకూలంగా సక్సెస్ కోసం ‘ఎస్’తోనే ఎక్కువసార్లు సాగారు విశ్వనాథ్.