Site icon NTV Telugu

ENG vs IND: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సెలక్షన్‌కు అందుబాటులోనే బుమ్రా!

Jasprit Bumrah

Jasprit Bumrah

ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను మూడింటిలో మాత్రమే ఆడించాలని టీమిండియా టీమ్‌మేనేజ్‌మెంట్‌ ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. ఐదు వికెట్స్ పడగొట్టాడు. అయితే తొలి టెస్టులో భారత్ ఓటమిపాలై.. 0-1తో సిరీస్‌లో వెనుకబడింది. ఇక జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మొదలనుంది. ఈ టెస్టులో బుమ్రా ఆడుతాడో లేదో అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్‌ డస్కాటే స్పందించాడు.

Also Read: Today Astrology: మంగళవారం దినఫలాలు.. ఆ రాశి వారు ఈరోజు జాగ్రత్త సుమీ!

రెండో టెస్టు మ్యాచ్‌ సెలక్షన్‌కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని ర్యాన్ టెన్‌ డస్కాటే తెలిపాడు. ‘జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. మూడే టెస్టులు మాత్రమే ఆడతాడని మనకు తెలుసు. మొదటి మ్యాచ్ తర్వాత కోలుకోవడానికి అతడికి వారం రోజుల సమయం లభించింది. పరిస్థితులు, పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఆలోచిస్తున్నాం. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మిగతా ఆటగాళ్ల పనిభారంపై కూడా దృష్టిపెట్టాం. టెక్నికల్‌గా బుమ్రా రెండో టెస్ట్ మ్యాచ్ సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటాం. వాతావరణం, పిచ్‌ ఎలా ఉంటుందనే దానిపై ఆతడు ఆడేది లేనిది ఆధారపడి ఉంటుంది’ అని డస్కాటే చెప్పాడు.

Exit mobile version