NTV Telugu Site icon

Russian Soyuz Spacecraft : రష్యా అంతరిక్ష నౌకలో లీకేజీ.. వ్యోమోగామల స్పేస్ వాక్‎కు బ్రేక్

Space

Space

Russian Soyuz Spacecraft : రష్యాకు చెందిన సోయుజ్ వ్యోమనౌక నుంచి ఒక ద్రవం లీక్ అవుతుంది. దీంతో రష్యన్ వ్యోమగాములు చేసిన స్పెస్ వాక్ రద్దు చేయబడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రాస్వెట్ మాడ్యూల్‌కు డాక్ చేయబడిన సోయుజ్ MS-22 అంతరిక్ష నౌక వెనుక భాగం నుండి తెలియని ద్రవం లీక్ అవుతోందని భూమిపై ఉన్న రష్యా ఖగోళ నిపుణులు గుర్తించారు. రష్యన్ వ్యోమగాములు సెర్గీ ప్రోకోపీవ్, డిమిత్రి పెటెలిన్ స్పేస్‌వాక్‌కు సిద్ధమవుతుండగా మాస్కోలోని అంతరిక్ష నిఫుణులు ఈ లీకేజీని గుర్తించారు.

Read Also: Woman Marries Lord Vishnu : మహా విష్ణువును పెళ్లి చేసుకున్న మహిళ

కాగా, గుర్తించని లిక్విడ్‌ లీకేజీ వల్ల సోయూజ్‌ ఎంఎస్‌-22 క్యాప్సూల్‌లోని పరికరాల్లోని పీడనం తగ్గినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అందులోని రష్యా కాస్మోనాట్స్ వారి స్పేస్‌సూట్‌లను తీసివేసి, అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు.ఎయిర్‌లాక్‌ ప్రెజర్‌ను పునరుద్ధరించారు. అలాగే తమ స్పేస్‌ సూట్లను తొలగించి స్పేస్‌ స్టేషన్‌లోకి తిరిగి వచ్చారు. మరోవైపు ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌ నుంచి వెలువడుతున్న ద్రవం లీకేజీని పరిశీలిస్తున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ తెలిపింది. నాసా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ లీకేజీ వల్ల రష్యా స్పేస్‌క్రాఫ్ట్‌పై పడే ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.