టర్కీలో రష్యన్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం టర్కీలోని అంటాల్య ఎయిర్‌పోర్టులో సుఖోయ్ సూపర్‌జెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. దీంతో ఎమర్జెన్సీ డోర్ నుంచి ప్రయాణికులు కిందకు దిగేశారు. మొత్తం 89 ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది సురక్షితంగా దిగేశారు. ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Heart Attack: చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.. కారణాలు ఇవే..
రష్యాకు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్ ప్రయాణికుల విమానం తుర్కియేలోని అంటాల్యా విమానాశ్రయంలో రఫ్‌గా ల్యాండ్ అయింది. అకస్మాత్తుగా గాలి కారణంగా విమానం ల్యాండింగ్‌లో సమస్య తలెత్తిందని తెలుస్తోంది. అయితే ల్యాండ్ అయిన వెంటనే విమానం ఇంజిన్ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలో మంటలు విమానానికి వ్యాపించాయి. దీంతో అందులోని 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. అంటాల్యా విమానాశ్రయానికి చెందిన రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి 95 మందిని కాపాడి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రష్యా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ రోసావియాట్సియా తెలిపారు. ప్రమాదానికి గురైన సుఖోయ్ సూపర్‌జెట్ విమానం గత ఏడేళ్లుగా వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానం రష్యాలోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం సోచి నుంచి టర్కీలోని అంటాల్యాకు వచ్చింది.