Site icon NTV Telugu

Russia Ukraine war: యుద్ధం ముగింపు ఉత్తుత్తి మాటలేనా?.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

06

06

Russia Ukraine war: రష్యా – ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. దాదాపు 500కు పైగా డ్రోన్లతో తమ దేశంలోని పశ్చిమ ప్రాంతాలపై మాస్కో దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మాస్కో-కీవ్‌ల యుద్ధం ముగింపు కోసం ట్రంప్.. పుతిన్, జెలన్‌స్కీలతో వేరువేరుగా చర్చలు జరిపారు. ఈ రెండు దేశాలు యుద్ధానికి ముగింపు పలుకుతాయని ప్రపంచం అనుకుంటుంటే ఈ దాడి జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

READ MORE: Judge Frank Caprio: ఈ జడ్జి చాలా స్పెషల్.. ఇక లేరంటూ కుటుంబం పోస్ట్..

ఈ ఏడాది ఇదే అతి పెద్ద దాడి..
తమ దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకొని రష్యా దాదాపు 574 డ్రోన్లు, 40 క్షిపణులతో విరుచుపడిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ఈ ఏడాది మాస్కో చేసిన వైమానిక దాడుల్లో ఇదే అతి పెద్దదని పేర్కొంది. స్థానిక అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారని తెలిపారు. పశ్చిమ ఉక్రెయిన్ లోని ప్రధాన అమెరికన్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా పేర్కొన్నారు. కానీ ఆయన దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

అలాస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యి కీవ్లో శాంతి నెలకొల్పడంపై చర్చించారు. దీంతో సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతోన్న రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగిసిపోతుందని ప్రపంచం ఆశించింది కానీ, తాజా దాడులతో పరిస్థితులు ప్రభావితం అయ్యాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూన్ ప్రారంభంలో ఉక్రెయిన్ ప్రత్యేక దళాలు రష్యాపై వరుస వైమానిక దాడులు చేశాయి. ఉక్రెయిన్ ఈ దాడుల్లో రష్యన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 41 రష్యన్ బాంబర్లను నేలపై నాశనం చేసింది. ఈ దాడిలో రష్యా బాంబర్ ఫ్లీట్, రాడార్ వ్యవస్థలలో 30 శాతానికి పైగా దెబ్బతిన్నాయని అంచనా. ఈ పరిస్థితుల్లో పుతిన్, జెలెన్‌స్కీల మధ్య త్రైపాక్షిక భేటీని ట్రంప్ ఎక్కడ, ఎలా ఏర్పాటు చేస్తారనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు.

READ MORE: China ETIM threat: చైనాను భయపెడుతున్న ఉగ్రసంస్థ.. బీజింగ్‌ భయానికి కారణాలు ఏంటి?

Exit mobile version