Russia Poseidon Drone: రష్యా ప్రపంచాన్ని కుదిపేసింది. తాజాగా మాస్కో నీటి అడుగున అణు జలాంతర్గామి డ్రోన్‌ను పరీక్షించింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. పుతిన్ ప్రకటన అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో ప్రకంపనలు సృష్టించదని విశ్లేషకులు చెబుతున్నారు. పుతిన్ ప్రకటన ప్రభావం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణ అణు పరీక్షకు ఆదేశించేలా చేసిందని నిపుణులు పేర్కొన్నారు.
READ ALSO: CP Sajjanar: వాట్సప్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ ప్రచారం.. సీపీ సజ్జనార్ సీరియస్..
సముద్రంలో సునామీ సృష్టించిన పోసిడాన్ ..
తాజాగా రష్యా నీటి అడుగున ప్రయోగించిన డ్రోన్‌కు పోసిడాన్ అని పేరు పెట్టనట్లు సమాచారం. ఈ డ్రోన్ సామర్థ్యాల గురించి ఇంకా ఎటువంటి సమాచారం విడుదల కాలేదు. అణు సామర్థ్యం గల ఆటోమేటిక్ మానవరహిత జలాంతర్గామి డ్రోన్ పోసిడాన్‌ను పరీక్షించినట్లు పుతిన్ స్వయంగా పేర్కొన్నారు. ఇది రష్యాలోని అత్యంత శక్తివంతమైన సర్మత్ క్షిపణి కంటే శక్తివంతమైనదని ఆయన వెల్లడించారు. పోసిడాన్ డ్రోన్‌ను జలాంతర్గామి నుంచి పరీక్షించారు. ఈ డ్రోన్‌లో పెద్ద జలాంతర్గామి రియాక్టర్ కంటే 100 రెట్లు చిన్న అణు విద్యుత్ ప్లాంట్ అమర్చారు.
సమరత్ క్షిపణిని త్వరలో రష్యన్ సైన్యంలోకి చేర్చనున్నట్లు పుతిన్ చెప్పారు. పోసిడాన్ రియాక్టర్ అసాధారణమైనదని, దాని నిర్మాణంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. 2018లో దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ మాట్లాడుతూ.. అణు సామర్థ్యం గల డ్రోన్ అభివృద్ధి గురించి ప్రస్తావించారు. తాజాగా మంగళవారం పరీక్ష సమయంలో పోసిడాన్ డ్రోన్ విజయవంతమైందని పుతిన్ వెల్లడించారు. అయితే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన అందించలేదు.
పోసిడాన్ డ్రోన్ గురించి అధ్యక్షుడు పుతిన్ వివరించనప్పటికీ, తీరప్రాంతాల సమీపంలో పేల్చడానికి దీనిని రూపొందించారని రష్యన్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీని పేలుడు రేడియోధార్మిక నీటితో నిండిన శక్తివంతమైన సునామీని ప్రేరేపించవచ్చని రష్యన్ మీడియా వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
READ ALSO: YS Jagan : ఇవన్నీ మానవ తప్పిదాలు.. చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది
