Site icon NTV Telugu

Drones Attack: కీవ్‌పై రష్యా డ్రోన్ల దాడి.. ముగ్గురు మృతి, 29 మందికి గాయాలు..!

Drones Attack

Drones Attack

Drones Attack: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో 29 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఇక మరణించిన వారిలో 19 ఏళ్ల మహిళ, ఆమె 46 ఏళ్ల తల్లి ఉన్నారని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇహోర్ క్లైమెంకో తెలిపారు. రష్యా డ్రోన్ల దాడి కారణంగా రాజధానిలోని దెస్నియాన్స్కీ జిల్లాలోని రెండు నివాస భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. అత్యవసర సిబ్బంది 16 అంతస్తుల భవనాల నుంచి పౌరులను సురక్షితంగా తరలించి, మంటలను ఆర్పారు.

Jubilee Hills By Poll Elections 2025: జూబ్లీహిల్స్లో రెండు విడతలుగా సీఎం ఎన్నికల ప్రచారం !

ఆదివారం తెల్లవారుజామున రష్యా మొత్తం 101 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 90 డ్రోన్లను కూల్చివేసి నిలిపివేశారు. ఇక ఐదు డ్రోన్లు నాలుగు వేర్వేరు ప్రాంతాలను తాకగా, డ్రోన్ల శిథిలాలు మరో ఐదు ప్రాంతాలలో పడినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా క్షిపణి, డ్రోన్ల దాడిలో ఒక రోజు ముందు కీవ్‌లో మొత్తం నలుగురు మరణించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పశ్చిమ దేశాల వైమానిక రక్షణ వ్యవస్థల కోసం మరోసారి విజ్ఞప్తి చేశారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం విడుదల చేసిన వ్యాఖ్యల ప్రకారం.. రష్యా కొత్తగా అణ్వాయుధ సామర్థ్యం, పవర్డ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిందని, ఇది ఇప్పటికే ఉన్న రక్షణ వ్యవస్థలను అధిగమించగలదని పేర్కొన్నారు.

Pennsylvania: యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు..!

Exit mobile version