NTV Telugu Site icon

Russia Ukraine War: సోలెడార్‎ను ఆక్రమించామంటున్న రష్యా.. నీకంత లేదన్న ఉక్రెయిన్

Solider

Solider

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది కావొస్తుంది. రెండు వైపులా దాడుల్లో ఎంత నష్టపోతున్నా వెనక్కి తగ్గనంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని సోలెడార్ నగరాన్ని రష్యా ఆక్రమించింది. రష్యన్ ప్రైవేట్ మిలిటరీ వాగ్నర్ గ్రూప్ ఉక్రేనియన్ సైనికులను చంపిన తర్వాత నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ సమూహాన్ని పుతిన్ చెఫ్ మెవ్జెనీ ప్రిగోగిన్ నిర్వహిస్తారు. సోలెడార్‌లోని సాల్ట్ మైన్‌లో సైనికులతో కలిసి ఉన్న ఫోటోను మెవ్జెని తన గ్రూప్‌లో పంచుకున్నారు. దాదాపు 500 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని కూడా ఆయన చెప్పారు. సోలెడార్ ఉక్రెయిన్ యొక్క పశ్చిమ భాగంలో ఉన్న ఒక చిన్న పట్టణం. రష్యా చేసిన ప్రకటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండిస్తోంది. వాగ్నర్ వాదనపై ఉక్రెయిన్ సవాల్ విసిరింది. యుద్ధం ఇంకా ముగియలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు.

Read Also: Plane Door Open : గాల్లో ఉండగా తెరుచుకున్న విమానం డోర్..

తమ దేశ సైనికులు శత్రువులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారని, సోలెడార్‌పై దండెత్తిన సుమారు 100 మంది రష్యా సైనికులను చంపేశారని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ రెండూ సోలెడార్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతాన్ని ఇరు దేశాలు ఆక్రమించుకున్నట్లు కనిపిస్తోందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ అన్నారు. సోలెడార్‌లో చాలా ప్రమాదకరమైన రీతిలో యుద్ధం జరుగుతోంది. ఇంతలో రష్యా యుద్ధంలో గెలిచిన నగరాలను ఉక్రెయిన్ నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అటువంటి పరిస్థితిలో ఉక్రెయిన్‌లోని ఏదైనా కొత్త భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించవద్దని రష్యా ఇప్పటికే తన అధికారులను ఆదేశించింది. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడైన మెవ్‌జెనీ.. సోలెడార్ పట్టణాన్ని ఆక్రమించుకున్నట్లు ప్రకటించారు. సోలెడార్ పూర్తిగా ధ్వంసమైందని, సోలెడార్ ప్రాంతం మొత్తం శవాలతో నిండి ఉందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సోమవారం ఒక ప్రసంగంలో చెప్పారు.