NTV Telugu Site icon

Love Marriage : 92 ఏళ్ల వయస్సులో ప్రేమ.. త్వరలోనే ఆమెతో పెళ్లి..

Media Mogal

Media Mogal

ప్రపంచ మీడియా మొఘల్ 92 ఏళ్ల రూపర్ట్ మర్డాక్ ఐదోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా మరో మహిళతో పెళ్ళికి సిద్ధమయ్యారు. ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా రూపర్ట్ చేసుకున్నారు. నాలుగో భార్యజెర్రీ హాల్తో విడాకులు తీసుకున్న సంవత్సరంలోపే మరో పెళ్లికి సిద్దమైపోయారు. 66 ఏళ్ల లెస్లీ ఆన్ను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు రూపర్ట్ మర్డాక్ ప్రకటించారు. ఇదే తన చివరి వివాహమని క్లారిటీ కూడా ఇచ్చారు. వీరి ఎంగేజ్మెంట్ న్యూయార్క్ లోని సెయింట్ పాట్రిక్ లో జరిగింది. మరో మీడియా సంస్థ ప్రముఖుడైన దివంగత చెస్టర్ స్మిత్ భార్య లెస్లీ ఆన్ను ఈ ఏడాది వేసవిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. కాలిఫోర్నియా, బ్రిటన్, న్యూయార్క్ లో వారి జీవితాన్ని గడపనున్నారు.

Also Read : MLA Raja Singh: లైసెన్స్ గన్ ఇవ్వండి.. డీజీపీ కి రాజాసింగ్ లేఖ

తాను 14 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నాను.. 70 ఏళ్ల వయసుకు చేరుకోవడం అంటే దాదాపు చివరికి వచ్చినట్లే.. మా ఇద్దరికీ ఇది దేవుడ ఇచ్చిన కానుక, మేమిద్దరం గత సెప్టెంబర్ లో కలిశాం.. మా నిర్ణయం పట్ల మా స్నేహితులు చాలా సంతోషం వ్యక్తం చేశారని ప్రపంచ మీడియా సంస్థల అధినేత రూపర్ట్ తెలిపారు. న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలినీయర్ అయిన రూపర్ట్ మార్డాక్ 2016లో జెర్రీ హాల్ ను(65) పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ అమెరికన్ నటి, మోడల్ అయిన హాల్.. రూపర్ట్ కంటే 25 ఏళ్లు తక్కు వయసు. 2022 జులై 1న వీరు విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. అదే ఏడాది ఆగస్టులో కోర్టు మంజూరు చేసింది.

Also Read : SSMB 28: ఏ క్షణంలోనైనా అప్డేట్ ల్యాండ్ అవ్వొచ్చమ్మా… రెడీగా ఉండండి

మార్డాక్ ఇప్పటికే పాట్రిషియా బుకర్, అన్నా మరియా మన్, వెండీ డెంగ్ ను వవాహం చేసుకున్నారు. అయితే ఈ నలుగురితోనూ రూపర్ట్ విడాకులు తీసుకున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన రెండో భార్య మన్ నుంచి విడిపోతున్నప్పుడు రూపర్ట్ మార్డాక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటి. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తిని భరణంగా చెల్లించినట్లుగా సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలను కలిగి ఉన్న మర్దాక్ ఆస్తుల నికర విలువ సుమారు 17.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించింది.