Guntur Rape Case: గుంటూరు పరిధికి సంబంధించి రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. సత్రగంజ్- చర్లపల్లి రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. రెండ్రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం సికింద్రాబాద్ లో కేసు నమోదైంది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు రైల్వే పోలీసులు.. మహిళ వద్ద నుంచి దొంగిలించిన బ్యాగ్ లోని సెల్ ఫోన్ సత్తెనపల్లిలో విక్రయించినట్లు గుర్తించారు. అనంతరం తెనాలి పారిపోయినట్లు పోలీసులకు చెప్పాడు. తెనాలిలో రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
READ MORE: Indian Army: పాక్‌పై భారత్ మరో దాడి.. 1971 నాటి లొంగుబాటు ఫొటో వైరల్
అసలు ఏం జరిగింది..?
గుంటూరు జిల్లా పరిధిలో నిన్న దారుణ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం జరిగింది. గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్రగంజ్ నుంచి చెర్లపల్లి వెలుతున్న ట్రెయిన్ మహిళా భోగిలోకి గుర్తుతెలియని వ్యక్తి ఎక్కాడు.. గుంటూరు పెదకూరపాడు స్టేషన్ల మధ్య ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బ్యాగ్, ఫోన్ లాక్కొన్నాడు నిందితుడు. అనంతరం ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. మహిళ కేకలు వేయడంతో పెదకూరపాడు వద్ద ట్రెయిన్ లో నుంచి దూకి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు చర్లపల్లికి చేరుకున్న తరువాత జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఒక్కరోజులోనే పట్టుకున్నారు.
READ MORE: KL Rahul కార్ల కలెక్షన్‌లోకి మరో లగ్జరీ కారు.. ఈసారి ఏ కారు కొన్నారంటే? వైరల్ వీడియో..
