NTV Telugu Site icon

Prabhas Prashanth Varma : ఏంటి అస్సలు ఊహించలేదే.. ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబోనా ?

New Project 2024 10 19t104434.228

New Project 2024 10 19t104434.228

Prabhas Prashanth Varma : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కాని విషయమే. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.. కథ నచ్చితే వెంటనే ఛాన్స్ ఇచ్చేస్తాడు. బాహుబలి వంటి సినిమా తర్వాత సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ చేశాడు ప్రభాస్. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో కల్కి సినిమాలు తీశాడు. ప్రస్తుతం మారుతితో రాజాసాబ్‌, హనురాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కమిట్ అయ్యాడు. ఎలాగూ సలార్ 2, కల్కి 2 లైన్లో ఉండనే ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో ఉన్న దర్శకుడు ఎవరు అంటే.. ఊహించని పేరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ప్రశాంత్.. ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఙను లాంచ్ చేసే పనిలో ఉన్నాడు.

Read Also:Bomb Threat: ఎయిర్ ఇండియా విమానంకు బాంబు బెదిరింపు.. విమానంలో 189 మంది ప్రయాణికులు

అలాగే.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జై హనుమాన్‌తో పాటు మహాకాళీ, అధీరా లాంటి సినిమాలు ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో ఛాన్స్ అందుకున్నట్టుగా ఓ వార్త వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడైనా రావొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇందులో నిజముందా? అంటే, ఖచ్చితంగా కాదని చెప్పలేం. గతంలో ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్‌ను తన డైరెక్షన్‌లో గ్రాండ్‌గా నిర్వహించాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా ఛాన్స్ కొట్టేసిన ఆశ్యర్యపోనక్కర్లేదు. ప్రభాస్‌కు కథ నచ్చితే చాలు.. ఈ క్రేజీ కాంబో సెట్ అయినట్టే. ఇప్పటికే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ప్రభాస్ కోసం సూపర్ హీరో కథ ఒకటి రాసుకున్నాడనే టాక్ కూడా ఉంది. అయితే.. ప్రభాస్ ఛాన్స్ ఇచ్చిన కూడా ప్రశాంత్ మరో మూడు నాలుగేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ మాత్రం సోషల్ మీడియా రూమర్‌గానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Read Also:CM Revanth Reddy: నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు..

Show comments