Site icon NTV Telugu

Rules Ranjann : రూల్స్ రంజన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

Whatsapp Image 2023 11 18 At 10.22.25 Pm

Whatsapp Image 2023 11 18 At 10.22.25 Pm

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా థియేటర్ల లో రిలీజైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. డిసెంబర్ 1 నుంచి రూల్స్ రంజన్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.థియేటర్ రిలీజ్‌ కు ముందు ఈ చిన్న సినిమాపై మంచి క్రేజ్ ఉండటం తో ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నది.ఎంతో హైప్ తో విడుదల అయిన రూల్స్ రంజన్ అంతగా ఆకట్టుకోలేదు.. ఈ సినిమా లో చూపించిన లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం అలాగే కామెడీ ఆశించిన స్టాయిలో వర్కవుట్ కాకపోవడం తో రూల్స్ రంజన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నది. ఫస్ట్ వీక్‌ లోనే థియేటర్లలో కనుమరుగై పోయింది…

థియేటర్ లలో ఈ సినిమా రిజల్ట్ కారణంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమైనట్లు సమాచారం.రూల్స్ రంజన్ సినిమా లో నేహా శెట్టి తో పాటు మెహర్ చాహల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా లో సుబ్బరాజు, హర్ష చెముడు మరియు హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. గతం లో నీ మనసు నాకు తెలుసుతో పాటు గోపీచంద్ ఆక్సిజన్‌ అలాగే మరికొన్ని సినిమాలకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు.కిరణ్ అబ్బవరం మీటర్‌, రూల్స్ రంజన్‌ సినిమాలతో వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసాడు. దాదాపు నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌ తో రూల్స్ రంజన్ థియేటర్లలో రిలీజైంది.కేవలం కోటిన్నరా వరకు మాత్రమే వసూళ్లను రాబట్టి నిర్మాతల కు నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమాల రిజల్ట్‌ లతో సంబంధం లేకుండా కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు..

Exit mobile version