NTV Telugu Site icon

Vehicles Registration in TS: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌

Telangana

Telangana

Vehicles Registration in TS: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయింది. ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా శాఖ సర్వర్‌ డౌన్‌ కావడం వల్ల కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆర్టీఏ వెబ్‌సైట్‌లో వివరాలు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు.

Read Also: Man Stabs Daughter: దారుణం.. కన్నకూతురినే 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..

స్లాట్ బుక్‌ చేసి వాహనాల రిజస్ట్రేషన్ కోసం వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. త్వరలోనే పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో టెక్నికల్ టీమ్ సర్వర్‌లో ఏర్పడిన ఇబ్బందిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. అటు ఏపీలోనూ సర్వర్ డౌన్‌తో రెండు రోజుల నుంచి భూములు రిజిస్ట్రేషన్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.