Site icon NTV Telugu

R.S. Praveen Kumar: రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి..

నాగర్ కర్నూల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు అడుగంటి పోతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో బాధతో మాట్లాడుతున్నామని తెలిపారు. పది రోజుల ముందే డీజీపీకి నాగర్ కర్నూల్ లో ఉన్న పరిస్థితులు వివరించామన్నారు. అయినా ఈ హత్య జరిగింది.. రాయలసీమ ఫ్యాక్షనిజం లాంటి పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు శ్రీధర్ రెడ్డి హత్యలో ఒక్కర్ని కూడా అదుపులోకి తీసుకోలేదని ప్రవీణ్ కుమార్ చెప్పారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలా వ్యవహరిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని.. సిట్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కొల్లాపూర్ ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: MS Dhoni: రాంచీలో ఓటేసిన ధోనీ.. ఎగబడ్డ అభిమానులు

మరోవైపు.. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక మంత్రి అండతోనే కొల్లాపూర్ లో హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం పోలీసులు ఆ మంత్రిపై కేసు నమోదు చేయాలని కోరారు. కొన్ని సామాజిక వర్గాల మీద అతను ప్రత్యేకంగా దాడులకు పురి కోల్పోతున్నారని అన్నారు. సీఎం రేవంత్ ఈ కేసు పై స్పందించాలని తెలిపారు. తక్షణమే ఆ మంత్రిని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ధాన్యం గోడౌన్ లలో ఆ మంత్రి మనుషులు దొంగతనాలు చేస్తే సామాన్యుల పై కేసులు పెడుతున్నారని అన్నారు. మంత్రి ఏ విచారణకైనా సిద్ధం అంటున్నారు.. సీబీఐ విచారణకు తాము డిమాండ్ చేస్తున్నాం.. అతను ఒప్పుకోవాలని అన్నారు.

Read Also: Telangana MLC ByPoll: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం..

Exit mobile version