Uttar Pradesh: ఓ యువకుడి ఖాతాలో రూ.9,900 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు నిద్రలేచి చూసేసరికి మీ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది. మీరు ఒక్కసారి ఉత్సాహంగా ఫీలవ్వచ్చు కాని అది సాంకేతిక లోపంతో వచ్చిందని బ్యాంక్ అధికారులు చెబితే ఆ ఉత్సాహం కాస్త నిరుగారిపోతోంది. ఉత్తర్ ప్రదేశ్ లో అచ్చం ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాకు చెందిన భాను ప్రకాష్ ఖాతాలో ఏకంగా రూ.9,900 కోట్లు జమయ్యాయి. ఆ మెసెజ్ చేసిన అతడు ఉలిక్కిపడ్డాడు. ఈ ఘటనపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయగా సాఫ్ట్‌వేర్ లోపంగా గుర్తించారు.
భాను ప్రకాష్ కు తన బరోడా యూపీ బ్యాంక్ ఖాతాలో రూ. 99,99,94,95,999.99 జమయినట్లు మెసేజ్ వచ్చింది. అది చూసినప్పుడు తన కళ్లను తానే నమ్మలేకపోయానని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించగా.. అసలైన కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణ ఖాతా నుంచి అనుకోకుండా నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా మారిన తర్వాత, బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్‌లోని బగ్ కారణంగా ఖాతాలో నగదు జమైనట్లు చూపించిందని అధికారులు తెలిసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ రోహిత్ గౌతమ్ వెల్లడించారు. ఖాతాదారునికి పూర్తి విషయాలు తెలిపిన తర్వాత ఆ తప్పును సరిచేసేందుకు ఖాతాను కొన్ని రోజుల వరకు నిలిపేస్తున్నట్లు చెప్పారు.
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
కాగా.. గత ఏడాది చెన్నై లో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ ఇద్రిస్ కి అతని స్నేహితుడు రెండు వేల రూపాయలు పంపగా అతని ఖాతాలో రూ.753 కోట్లు (రూ. 753,48,35,179.48) వచ్చాయి. అప్పుడు కూడా సాఫ్ట్‌వేర్‌లో పొరపాటు జరిగిందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!